ఢిల్లీలో దొంగలా తిరుగుతున్నారు.. నారా లోకేశ్‌పై అనిల్ ఫైర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ ను శాశ్వతంగా లోపల వేస్తామన్న లోకేశ్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జగన్ ను శాశ్వతంగా లోపల వేయడానికి లోకేశ్ ఎవరు అని ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నుంచి తప్పించుకునేందుకు లోకేశ్ ఢిల్లీలో దొంగలా తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. ఎవరిని ఎవరు లోపల వేశారో తెలుస్తోంది కాదా అని సైటెర్లు వేశారు. అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ బయటకు వస్తోందని హెచ్చరించారు. నాలుగున్నరేళ్ల పాటు అరెస్ట్ చేయకుండా ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని.. విచారణ చేయకుండా ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. విచారణ పూర్తి అయ్యాక చంద్రబాబును అరెస్ట్ చేశామని, అందులో కక్ష సాధింపు ఏముందని అనిల్ కుమార్ ప్రశ్నించారు.