జరిగిందొకటి.. నమోదైన కేసు ఇంకొకటి: కోడి కత్తి ఘటనలో సంచలన విషయం
కోడి కత్తి ఘటనలో జరిగిందొకటని, నమోదైన కేసు ఇంకొకటని మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు..

దిశ,వెబ్ డెస్క్: కోడి కత్తి కేసు(Kodi Kathi Case)లో జరిగిందొకటని.. నమోదైన కేసు ఇంకొకటని మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు(Former DGP AB Venkateswararao) ఆరోపించారు. కోడి కత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీనును కోనసీమ జిల్లా ముమ్మడివరం(Mummadivaram)లో ఆయన కలిశారు. కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీ మాట్లాడుతూ జగన్ బాధితులకు న్యాయం చేసేందుకు తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. తొలుత శ్రీనుకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. శ్రీను చేసింది పొరపాటు అని, ఇందుకు మూడు రెట్లకు పైగానే శిక్ష అనుభవించాడని ఏబీవీ పేర్కొన్నారు.
కోడికత్తి కేసులో బెయిల్ వచ్చినా శ్రీనుకు ఉపాధి దొరికే పరిస్థితి లేదని ఏబీవీ చెప్పారు. శ్రీను భవిషత్తు నాశనం అయినా వైసీపీ అధినేత జగన్ వదిలిపెట్టడంలేదని, కేసులు మీద కేసులు వేసి కోడి కత్తి విచారణను ముందుకు సాగనివ్వడంలేదని ఆరోపించారు. ఇందులో భాగంగానే కోడి కత్తి కేసును విజయవాడ నుంచి విశాఖకు బదిలీ చేసేలా కోర్టును కోరారని ఏబీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.