AP News:రేపు విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటన

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రేపు(మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. జగ్గయ్యపేటలో దాడికి గురైన తమ పార్టీ కార్యకర్తను పరామర్శించనున్నారు.

Update: 2024-08-05 15:06 GMT

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రేపు(మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. జగ్గయ్యపేటలో దాడికి గురైన తమ పార్టీ కార్యకర్తను పరామర్శించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మహానంది మండలం సీతారామపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కొందరు దుండగులు జరిపిన దాడిలో వైసీపీ నేత పెద్ద సుబ్బరాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నంద్యాలకు వెళ్లి హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. సుబ్బారాయుడిని పోలీసుల ముందు టీడీపీ నేతలు చంపారని వైసీపీ ఆరోపిస్తోంది.


Similar News