YS Jagan:నేడు తిరుమలకు మాజీ సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే!

రాష్ట్రంలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-09-27 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 27(నేడు), 28 తేదీల్లో తిరుమలలో(Tirumala) పర్యటించనున్నారు. ఈ రోజు (శుక్రవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ షెడ్యూల్ వివరాలను వైసీపీ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం వైఎస్ జగన్(YS Jagan) ఈ రోజు సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం(Renigunta Airport) నుంచి తిరుమలకు బయలుదేరుతారు.

రాత్రి 7 గంటలకు జగన్ తిరుమలకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. ఈ క్రమంలో రేపు (శనివారం) ఉదయం 10.30 గంటలకు తిరుమల ఆలయానికి(Tirumala Temple) వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11.30 గంటలకు ఆలయం నుంచి గెస్ట్‌ హౌస్‌కు బయలుదేరుతారు. ఆ తర్వాత 11.50 గంటలకు తిరుమల నుంచి రేణిగుంటకు వెళ్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి(Renigunta Airport) చేరుకుంటారు. 1.30 గంటలకు రేణిగుంట నుంచి బెంగళూరులోని తన నివాసానికి వైఎస్ జగన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.


 




Similar News