వరద బాధితులకు రూ. కోటి విరాళంగా ఇచ్చిన ల‌లితా జ్యూవెల‌ర్స్ అధినేత

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు సంభవిస్తున్నాయి.

Update: 2024-09-09 12:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ లోని బుడమేరు వాగు పొంగడంతో పలు కాలనీలు నేటికి వరద నీటిలోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టించడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఏపీ, తెలంగాణ వరద బాధితులకు సహాయం కోసం విరాళం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ల‌లితా జ్యూవెల‌ర్స్ అధినేత కిర‌ణ్ రూ. కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులు ఊరికే రావు కానీ.. ఇలాంటి సమయంలో అందరూ ముందుకు రావాలని.. మనం సంపాదించిన సొమ్మును దానం చేసినప్పుడే దానికి ఒక సార్ధకత దక్కుతుందని అన్నారు. అలాగే 74 ఏండ్ల వయసులో కూడా చంద్రబాబు ప్రజల కోసం కష్టపడుతున్నారని ల‌లితా జ్యూవెల‌ర్స్ అధినేత కిర‌ణ్ చెప్పుకొచ్చారు.


Similar News