World Record: విజయవాడ డ్రోన్‌ షోకు ఐదు గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కృష్ణా నది తీరంలో డ్రోన్ షో(Drone Show) మంగళవారం జరిగింది.

Update: 2024-10-22 16:00 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కృష్ణా నది తీరంలో డ్రోన్ షో(Drone Show) మంగళవారం జరిగింది. పున్నమి ఘాట్ వేదికగా జరిగిన ఈ డ్రోన్ షోకి సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) హాజరయ్యారు. డ్రోన్ షో కి ముందు జరిగిన లేజర్ షో లో, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. డ్రోన్ షో కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. 5,500 డ్రోన్లతో తొలిసారిగా దేశంలోనే అతిపెద్ద షోను నిర్వహించారు. కాగా డ్రోన్ షోకు ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ఈ సందర్భంగా గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు.. డ్రోన్ షో అనంతరం.. సీఎం చంద్రబాబు నాయుడికి గిన్నిస్‌ బుక్‌ రికార్డు(Guinness book record) ధ్రువపత్రాలు అందించారు.

డ్రోన్ షో అందుకున్న ఐదు రికార్డులు

  1. లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతి (The shape of the largest planet)
  2. నదీ తీరాన లార్జెస్ట్‌ ల్యాండ్ మార్క్‌ (The largest land mark on the banks of the river)
  3. అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి (Largest national flag format)
  4. అతిపెద్ద ఏరియల్‌ లోగో ఆకృతి (Largest Arial logo format)
  5. అతిపెద్ద విమానాకృతి (Largest aircraft)

Similar News