Ap News:‘అటవీ శాఖలో ఖాళీల భర్తీ’..డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

Update: 2024-07-30 10:17 GMT

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే పలు శాఖలపై పవన్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (సోమవారం) అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీశాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ టైగర్ డే సందర్భంగా గంటపాటు ఈ సమావేశం సాగింది. అటవీ శాఖ అధికారులతో రెండో సారి పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో అటవీ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పులుల సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు.

Tags:    

Similar News