పేదలకు పండగ పూట పస్తులు.. ప్యాలెస్‌లో ఎంజాయ్ చేస్తున్న జగన్: పరిటాల సునీత

పండుగ నాడు పిండి వంటలు, కొత్తబట్టలతో కళకళలాడాల్సిన గ్రామాలు జగనాసురుడి దుర్మార్గాలతో నిస్తేజంగా తయారయ్యాయి అని మాజీమంత్రి పరిటాల సునీత అన్నారు.

Update: 2023-10-23 06:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : పండుగ నాడు పిండి వంటలు, కొత్తబట్టలతో కళకళలాడాల్సిన గ్రామాలు జగనాసురుడి దుర్మార్గాలతో నిస్తేజంగా తయారయ్యాయి అని మాజీమంత్రి పరిటాల సునీత అన్నారు. పెరిగిన ధరలు పేదలు పండగ చేసుకోవాలంటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది అని పరిటాల సునీత చెప్పుకొచ్చారు. కూరగాయల ధరలు మండిపోతున్నాయి అని ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు వణికిస్తున్నాయన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణపై గానీ, పేదలకు సబ్సిడీపై అందించే విషయంపై గానీ కనీసం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు అని చెప్పుకొచ్చారు. చివరికి రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఇంకేమీ ఇవ్వకుండా కోత పెట్టారు అని అన్నారు. పప్పు, పంచధార, గోధుమలు/గోధుమ పిండి, వంటనూనె లాంటి అన్ని సరుకులకూ కోత పెట్టారు అని తీవ్ర విమర్శలు చేశారు. గతంలో రేషన్ షాపుల్లో 8 రకాల సరుకులిచ్చి పేదలకు అండగా నిలిచాం కానీ నేడు నిత్యావసరాలపై నియంత్రణ లేదు అని ధ్వజమెత్తారు. రేషన్ షాపుల్లో ఏకంగా సరుకులే లేవు అని పరిటాల సునీత అన్నారు. ఒకవైపు ఉపాధి దూరం చేసి, మరోవైపు నిత్యావసరాల ధరల మోత మోగిస్తూ పేదల్ని దగా చేశారు అని మండిపడ్డారు. కడుపు నింపుకోవాలంటే ప్రజలు వలసలు వెళ్లాల్సిన దుస్థితి కల్పించారు. ధరలు దిగిరావాలంటే.. జగన్ రెడ్డి దిగిపోవాలని రాష్ట్రమంతా నినదిస్తోంది అని మాజీమంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News