Media Accreditation:జర్నలిస్టుల అక్రిడిటేషన్స్ కార్డుల గడువు పొడిగింపు

ఏపీలో జర్నలిస్టుల అక్రిడిటేషన్స్(Media Accreditation) కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో

Update: 2024-12-31 11:20 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో జర్నలిస్టుల అక్రిడిటేషన్స్(Media Accreditation) కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్స్ కార్డుల కాలపరిమితిని రెండు నెలలు పాటు జనవరి 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు పొడగిస్తూ ఐ అండ్‌ పీఆర్ డిపార్ట్మెంట్ (I&PR Dept) నుంచి అన్ని డీపీఆర్‌ఓ కార్యాలయాలకు (DPRO office) సర్క్యులర్ పంపించారు. ఈ క్రమంలో కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం కానీ.. ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, ఐఏఎస్, గారు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డిసెంబర్ 31, 2024 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే జనవరి 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు పొడిగింపు సౌకర్యం కొనసాగుతుందని ప్రకటనలో సంచాలకులు తెలియజేశారు.


Similar News