మరమ్మతులు చేస్తే డ్యామ్‌కే ప్రమాదం.. నిపుణుల కమిటీ హెచ్చరిక

తుంగభద్ర డ్యామ్‌పై నిపుణుల కమిటీ కీలక హెచ్చరికలు చేసింది. డ్యామ్ గేట్లు మొత్తం మార్చాలని నివేదికలో పేర్కొంది.

Update: 2024-09-10 02:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: తుంగభద్ర డ్యామ్‌పై నిపుణుల కమిటీ కీలక హెచ్చరికలు చేసింది. డ్యామ్ గేట్లు మొత్తం మార్చాలని నివేదికలో పేర్కొంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం కేవలం 45 ఏళ్లు మాత్రమేనని.. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ గేట్లను అదనంగా 25 ఏళ్లు వినియోగించారని తెలిపారు. ఇప్పుడు మరమ్మతులు చేస్తే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరించారు. కాగా, తుంగభద్ర ప్రాజెక్టును ఇటీవల నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎనడీఎస్‌ఏ) నియమించిన నిపుణుల కమిటీ సందర్శించింది. గత నెల 10న చైన లింక్‌ తెగిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్ట్‌గేట్‌తో పాటు మిగిలిన 32 క్రస్ట్‌గేట్ల భద్రత, పలు అంశాలపై అధ్యయనం చేసింది. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసింది.


Similar News