గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన

రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.

Update: 2023-03-03 08:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవలే ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 సన్నాహక సదస్సులో భాగంగా ఢిల్లీలో విశాఖ పరిపాలన రాజధాని అని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికపై నుంచి మరోసారి విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని ప్రకటించేశారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని మరోసారి వెల్లడించారు. త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ కానున్నట్లు స్పష్టం చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కల త్వరలోనే సాకారం కాబోతుందని.. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చేశారు. రాజధాని అంశంపై ఈనెల 28న సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్ విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News