ఏలూరు కార్పొరేషన్‌పై టీడీపీ కన్ను.. మేయర్ దంపతులకు లోకేశ్ ఆహ్వానం

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది..

Update: 2024-08-27 11:58 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలా మున్సిపాలిటీల్లో వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. తాజాగా ఏలూరు కార్పొరేషన్‌లోనూ వైసీపీకి భారీ షాక్ తగిలింది. మేయర్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మేయర్ దంపతులతో పాలు వైసీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


వీరంతా గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి టీడీపీ జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి అందరూ కలిసి రావాలని ఆహ్వానించారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కి ప్రజలు గుణపాఠం చెప్పినా.. ఆ పార్టీ నేతలు ఇంకా మారలేదని సెటైర్లు వేశారు. నిత్యం తెలుగుదేశం పార్టీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News