Breaking: ఏలేరు కాలువకు గండి.. నీట మునిగిన రాజుపాలెం కాలనీ

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో కాకినాడ జిల్లా రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. ...

Update: 2024-09-09 05:48 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో కాకినాడ జిల్లా రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. వెంటనే రాజుపాలెం కాలనీల్లో భారీగా నీరు చేరుతోంది. అంతేకాదు స్థానిక పంట పొలాలు నీటమునిగాయి. దీంతో అప్రమత్తమైన జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో, మండల వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గండిని పూడ్చేందుకు ఇసుక మూటలను వేస్తున్నారు. ఇక మండలం ఇప్పటికే కురిసిన వర్షంతో 3500 పంటలు నీట మునిగినట్లు అంచనా వేశారు. ఇక ఏలేరు రిజర్వాయర్‌కు 10 వేల క్యూసెక్కుల నీరు రావడంతో దిగువకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 


Similar News