Breaking: వైసీపీ ఏజెంట్‌కు కత్తిపోట్లు.. ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మండి కృష్ణాపురంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది...
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మండి కృష్ణాపురంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ ఏజెంట్ సురేశ్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో సురేశ్ పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద భారీగా మోహరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.