Chandrababu భారీ ప్లాన్.. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఇచ్చే సీట్లు ఇవే..!

జనసేనతో మిత్రబంధం కుదిరితే ఉభయ గోదావరి గోదావరి జిల్లాలో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. సీట్ల సర్దుబాటుపై తన రాజకీయ అనుభవాన్ని అంతా ఒడబోస్తున్నట్లు తెలుస్తోంది. ...

Update: 2023-02-01 11:13 GMT

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: జనసేనతో మిత్రబంధం కుదిరితే ఉభయ గోదావరి గోదావరి జిల్లాలో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. సీట్ల సర్దుబాటుపై తన రాజకీయ అనుభవాన్ని అంతా ఒడబోస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పార్టీతో పాటు, ఇతర మార్గాల ద్వారా రెండు ఉభయగోదావరి జిల్లాలో సర్వే చేయించారని, వాటి రిపోర్టుల అధారంగా సీట్లు కేటాయించాలని భావిస్తు్న్నారట. అలాగే వైసీపీ బలంగా ఉన్న చోట మిత్ర పక్షంలో భాగంగా జనసేనకు సీటు ఇస్తే మంచి ఫలితం ఉంటాయనే ఆలోచన కూడా చేస్తున్నారట. టీడీపీ బలంగా ఉన్న చోట ప్రస్తుత ఇంఛార్జిలకు సీట్లు ఇచ్చి, వైసీపీ బలంగా ఉన్న చోట మాత్రం జనసేనకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల అక్కడి జనసేన అభ్యర్థికి మద్దతుగా కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా కలుస్తుందని, అంతేగాక యువత కూడా కలుస్తుందనే నమ్మకంలో ఉన్నారట. దీని వల్ల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి చెమటలు పుడతాయనే నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత ప్రణాళిక రచించారట.


రామచంద్రపురం వైసీపీ స్ట్రాంగ్

రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని సర్వే రిపోర్టులు తేల్చాయి. మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ స్థానికంగా జనంలో బాగా దూసుకుపోతున్నారు. ఆయన చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. పల్లెలకు వెళ్లి అక్కడి జనాలతో మమేకం అవుతున్నారు. వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. మిగతా సమయంలో తన కార్యాలయంలో సందర్శకులకు సేవలు చేస్తున్నారు. అంతేగాక కార్యర్తలతో కలిసి పండగలు, శుభకార్యాలు సైతం చేసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన అనేక సర్వేల్లో రామచంద్రపురంలో వైసీపీ బలంగా ఉన్నట్లు వచ్చాయి. దీంతో ఇక్కడ జనసేనకు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధినేత ఉన్నట్లు సమాచారం. అలా చేయడం వల్ల కాపు సామాజికవర్గం కలుస్తుందని నమ్మతున్నారట. నియోజకవర్గంలో అధిక శాతం కాపు సమాజిక వర్గం ఉండటం వల్ల గెలుపు సునాయసనం అని అధినేత భావిస్తున్నారని ఆ పార్టీలు చెబుతున్నారు.


కాకినాడలో దూసుకుపోతున్న ద్వారంపూడి

అలాగే ఇటీవల నిర్వహించిన పీకే సర్వే (Pk Survey), ఇండియా టుడే సర్వే (India Today Survey), సొంతంగా నిర్వహించిన సర్వే‌లో సైతం కాకినాడలో వైసీపీ (Ycp) బలంగా ఉన్నట్లు‌గా రిపోర్టు వచ్చినట్లు సమాచారం. సిటీలో శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బలంగా ఉన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడంతో పలువురికి వ్యక్తిగత సహయాలు కూడా చేస్తున్నారు. కార్పోరేషన్ నిధులతో సిటీని బాగా అభివృద్ధి చేశారనే టాక్ కూడా ఉంది. ఇటీవల ఒక వీధికి దివంగత సినీ నటుడు రావుగోపాలరావు పేరు పెట్టడంతో స్వయంగా అతని కుమారుడు రావు రమేష్ ప్రత్యేకంగా అభినందిస్తూ వీడియో చేసి పంపారు. ఇది బాగా వైరల్ అయింది. ముఖ్యమంత్రి జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల ప్రత్యేక నిధులు తెస్తున్నారట. దీంతో సిటీలో ప్రతిపక్షం ప్రభావం బాగా తగ్గిపోయిందని సర్వేలు చెప్పాయట. అయితే ఈ చోట కూడా జనసేనకు ఇవ్వాలనే ఆలోచన టీడీపీ అధినేత చేస్తున్నారట. సిటీలో కాపులు అధిక శాతం ఉన్నారు. జనసేనకు ఇవ్వడం వల్ల కాపులు కలిసి వస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారట. అయితే ప్రక్క నియోజకవర్గం కాకినాడ రూరల్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది దీంతో భవిష్యత్తు పరిణామాలపై సస్పెన్స్ నెలకొంది.


ఇక ముమ్మడివరంలో టీడీపీకి బలం

ముమ్మడివరంలో టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు సర్వే రిపోర్టులు చంద్రబాబుకు అందాయట. ఇక్కడ ఇంఛార్జి దాట్ల సుబ్బరాజు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొన్నారట. నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారట. అధినేత చంద్రబాబుతోనూ సుబ్బరాజుకు మంచి సంబంధాలున్నాయి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించి సక్సెస్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. అంతేకాక నియోజకవర్గంలో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ జనంతో చక్కని మాటా మంతి చేస్తున్నారట. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సుబ్బరాజు టీడీపీ తరుపున పోటీ చేస్తే అధిక మెజార్టీతో విజయం సాధిస్తారని సర్వేలు తేల్చాయట. దీంతో ఇక్కడ సుబ్బారాజుకే పక్కాగా సీటు వస్తుందని ఆయన వర్గం నమ్ముతున్నారు. స్థానికంగా జనసేన ఇంఛార్జి బాలకృష్నను వేరే చోటకు పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


కొత్తపేటలో టీడీపీ జోరు

కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ (Tdp) జోరు సర్వేలో కనపడుతోంది. ఇక్కడ ఇంచార్జి బండారు సత్యానందరావు గతంలో జరిగిన చాలా ఎన్నికల్లో బోర్డర్‌ లైన్‌లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన‌పై ప్రజల్లో చాలా సానుభూతి పెరిగిందట. అయితే ఇక్కడ జనసేన ఇంఛార్జిగా స్వయానా సత్యానందరావు తమ్ముడు శ్రీనివాసరావు రంగంలో ఉన్నారు. ఆయనకు అధినేత పవన్‌తో మంచి సంబందాలున్నాయి. సీటు ఖచ్చితంగా వీరిద్దరి నడుమ ఉంటుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన ఎంతవరకూ ఉపయోగ పడుతుందో చూడాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి అనుకూలంగా ఉన్నందున సత్యానందరావుకు సీటు ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే జనసేన అధినేతకు మంచి ఆప్తుడు అవ్వడం వల్ల పవన్ సూచనల మేరకు శ్రీనివాసరావుకు సీటు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News