Kakinadaలో నిండు ప్రాణం తీసిన తాడి చెట్టు
కాకినాడ జిల్లాలో తాడి చెట్టు నిండు ప్రాణాలను తీసింది. ఏళ్ల తరబడి నిటారుగా నిలబడిన తాడిచెట్టు ఒక్కసారిగా మృత్యువుగా మారింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కబలించింది. ఈ అనూహ్య ఘటన కరప మండలం గొర్రిపూడిలో జరిగింది. ..
దిశ వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో తాడి చెట్టు నిండు ప్రాణాలను తీసింది. ఏళ్ల తరబడి నిటారుగా నిలబడిన తాడి చెట్టు ఒక్కసారిగా మృత్యువుగా మారింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కబలించింది. ఈ అనూహ్య ఘటన కరప మండలం గొర్రిపూడిలో జరిగింది. అరివిల్లి సుబ్బరాజు (52) వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఆయన బైక్‌పై వెళ్తుండగా తాడి చెట్టు విరిగి పడింది. దీంతో సుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. సుబ్బరాజు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తుఫాను దృష్ట్యా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో గొర్రిపూడిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ గాలులకు తాడి చెట్టు విరిగి సుబ్బరాజు పడినట్లు స్థానికులు చెబుతున్నారు.