చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: బ్రాహ్మణులు
కోణసీమ జిల్లా పి. గన్నవరం టీడీపీ టికెట్‌ను సరిపెల్ల రాజేశ్‌కు కేటాయించడాన్ని బ్రాహ్మణులు తప్పుబడుతున్నా
దిశ, వెబ్ డెస్: కోణసీమ జిల్లా పి. గన్నవరం టీడీపీ టికెట్‌ను సరిపెల్ల రాజేశ్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని బ్రాహ్మణులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో రాజేశ్ హిందూదేవుళ్లు, బ్రాహ్మణులు కించపర్చారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. బ్రాహ్మణులను ఓట్లు అడిగే హక్కును చంద్రబాబు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేశ్‌కు టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు పి.గన్నవరం టీడీపీ, జనసైన నేతలు, కార్యకర్తలు సైతం రాజేశ్ అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పి.గన్నవరం టికెట్‌పై చంద్రబాబు, పవన్ పునరాలోచించాలని అంటున్నారు.
Read More..
Breaking: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్