Kovvuru: బాధితులకు సీఎంఆర్ఎఫ్ సాయం
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత అందజేశారు. ..
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత అందజేశారు. శనివారం కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఏడు కుటుంబాలకు రూ. 12.65 లక్షల విలువ గల చెక్కులను అందించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలకు తానున్నానంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి అభయహస్తం అందిస్తోందన్నారు. బాధితులకు కొండంత అండగా జగనన్న ప్రభుత్వం నిలుస్తోందన్నారు. జిల్లాకు సంబంధించిన బాధిత కుటుంబాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే సీఎం జగన్ వెంటనే స్పందించి సాయం అందజేసినట్లు తెలిపారు. జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని మరోసారి రుజువు చేశారని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.