Prathipadu: ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలు.. వైసీపీకి నలుగురు కీలక నేతలు గుడ్ బై

ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో వైసీపీకి ఇద్దరు ఎంపీపీలు సహా నలుగురు ప్రజాప్రతినిధులు దూరమయ్యారు...

Update: 2023-11-25 12:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో వైసీపీకి ఇద్దరు ఎంపీపీలు సహా నలుగురు ప్రజాప్రతినిధులు దూరమయ్యారు. పార్టీలో తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ వారంతా రాజీనామా చేశారు. ఈ ఘటన కాకినాడ జిల్లా ప్రతిపాడులో జరిగింది. గత ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల వరకు బాగానే ఉన్నా  గత ఏడాది నుంచి ఆయన వైఖరి పట్ల ఏలేశ్వరం ఎంపీపీ నరసింహమూర్తి (బుజ్జి), భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాజ్జీ, రౌతులపూడి ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మి, తూర్పు లక్ష్మీపురం సర్పంచ్ డా. వీరంరెడ్డి నాగభార్గవి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కానీ సీఎం జగన్, పార్టీపై ఉన్న అభిమానంతో సెలైంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సామాజిక బస్సు యాత్ర జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమంలో కూడా వారికి అవమానం జరిగిందని భావించారు. దీంతో ఈ నలుగురు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. కనీసం పార్టీ బస్సు యాత్ర జరుగుతున్న విషయాన్ని కూడా తమకు ఎమ్మెల్యే శ్రీపూర్ణచంద్రప్రసాద్  సమాచారం అందించలేదని వాపోయారు. తమకు పార్టీలో కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదడంలేదని, ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలకు పోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీ క్రియా శీల సభ్యత్వాలకు తాము రాజీనామా చేస్తున్నామని శనివారం మీడియాకు వివరించారు. 

Tags:    

Similar News