ఇన్ని రోజులు ఎందుకు ఆగారు.. చంద్రబాబు అరెస్ట్‌పై అల్లుడు భరత్ ఆగ్రహం
చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన చిన్నల్లుడు భరత్ స్పందించారు..
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన చిన్నల్లుడు భరత్ స్పందించారు. చంద్రబాబును పరామర్శించేందుకు ములాకత్ తీసుకుని రాజమండ్రి జైలు వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ సాక్ష్యాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. పెళ్లి రోజేనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు. కేసులో ఆధారాలుంటే రెండున్నర సంవత్సరాలు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థల అండతో ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సారధ్యంలో తమ పోరాటం కొనసాగుతుందన్నారు. చంద్రబాబుకు అండగా తమ కుటుంబం పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ రాసిచ్చిన స్కిప్టును అమలు చేశారని భరత్ ఆరోపించారు. ‘సీఐడీ చర్యలు తీసుకుంటే మంత్రులు సంబురాలు ఎందుకు చేసుకుంటున్నారు. షెల్ కంపెనీలకు, చంద్రబాబుకు సంబంధమేంటి?. చంద్రబాబు వయసు, హోదాకు గౌరవం ఇవ్వలేదు.’ అని భరత్ పేర్కొన్నారు.