Breaking: చంద్రబాబుకు బిగ్ షాక్.. అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో బిగ్ సాక్ తగిలింది....
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశించింది. కస్టడీలో చంద్రబాబు చాలా ప్రశ్నలకు సమాధానాలు దాట వేశారని రిమాండ్‌తో పాటు కస్టడీని పొడిగించాలని సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. ఇందుకు చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా సీఐడీ వాదనను కోర్టు ఏకీభవించింది. చంద్రబాబు రిమాండ్ గడువును పొడిగించింది.
కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఇప్పటికే తొలి రిమాండ్ ముగిసింది. అటు సీఐడీ అధికారులు కూడా రాజమండ్రి జైలులోనే కస్టడీకి తీసుకుని చంద్రబాబును విచారించారు. కస్టడీ ముగియడంతో చంద్రబాబును వర్చువల్‌గా జైలు నుంచే ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. చంద్రబాబు రిమాండ్ పొడిగించింది.