ఏపీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ తేదీలు ఇవే..
రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్,
దిశ,ఎడ్యుకేషన్: రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీసెట్, ఆర్‌సెట్ల షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET 2023)ను మే 15 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఈఏపీసెట్‌లో భాగంగా మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. మే 23, 24, 25 తేదీల్లో బైపీసీ విభాగం ప్రవేశపరీక్షలు ఉంటాయి. ఈసారి ఈఏపీసెట్ పరీక్షలను గతేడాది కంటే రెండు నెలలు ముందుగా అంటే మే 15 నుంచే నిర్వహిస్తున్నారు. దీనివల్ల జూన్ ఆఖరుకల్లా అడ్మిషన్లతో సహా మొత్తం పక్రియ పూర్తవుతుంది. దీంతో జూలై నుంచే తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నారు.
ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్- తేదీలు:
ఈసెట్ - మే 5
లాసెట్ - మే 20
ఎడ్‌సెట్ - మే 20
ఐసెట్ - మే 25, 26
పీజీఈసెట్ - మే 28 - 30
పీజీసెట్ - జూన్ 6 - 10
ఆర్‌సెట్ - జూన్ 12- 14