దుర్గమ్మకు 3,033 పాల కలశాలతో అభిషేకం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు పాలాభిషేకం చేసేందుకు పాల కలశాలలతో బయలుదేరిన మహిళలతో ఆ పట్టణ వీధులన్ని కిక్కిరిశాయి.

Update: 2024-10-10 09:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు పాలాభిషేకం చేసేందుకు పాల కలశాలలతో బయలుదేరిన మహిళలతో ఆ పట్టణ వీధులన్ని కిక్కిరిశాయి. కొత్త చీరలు ధరించి బోనాన్ని తలపించే పాల కలశాలను నెత్తిన పెట్టుకుని మహిళలు జాతరలా సాగిపోగా పట్టణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. చిత్తూరు జిల్లా వి.కోట పట్టణంలో వెలసివున్నా శ్రీ దుర్గామాత ఆలయంలో దసరా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు తెల్లవారు జామున అమ్మవారికి పాలాభిషేకం కోసం భక్తి శ్రద్ధలతో మహిళలు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు పురవీధుల గుండా భారీ శోభయాత్రతో తరలివచ్చారు. 3,033 పాల కలశాలతో సాగిన మహిళల ఈ అధ్భుత ఆధ్యాత్మిక శోభా యాత్ర వీడియోలు వైరల్ గా మారాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దుర్గమ్మ క్షీరాభిషేకానికి గంటల కొద్దీ సమయం పట్టినా ఓపిగ్గా నిలుచుని అమ్మవారిపై తమ భక్తిని చాటుకున్నారు. 


Similar News