Sharmila : ఎమ్మెల్యే అంటే అర్థం తెలుసా..జగన్ ?: వైఎస్ షర్మిల

ఎమ్మెల్యే(MLA)అంటే అర్థం తెలుసా.. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం సామర్ధ్యం లేదా అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ఫర్మిల(YS Sharmila) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)పై మరోసారి ఫైర్ అయ్యారు.

Update: 2024-11-12 09:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్యే(MLA)అంటే అర్థం తెలుసా.. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం సామర్ధ్యం లేదా అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ఫర్మిల(YS Sharmila) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)పై మరోసారి ఫైర్ అయ్యారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఎల్ఏ అంటేనే అసెంబ్లీ సభ్యుడని అలాంటిది వారు అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. మీరు ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీకి పోమని ప్రజలకు ముందే చెప్పరా అని నిలదీశారు. ప్రతిపక్ష హోదా డిమాండ్ ముసుగులో అహంకారంతో జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని మండిపడ్డారు. అసలు అసెంబ్లీ వెళ్లడానికి మీకేమైందని వైఎస్ జగన్ పైన, వైసీపీ ఎమ్మెల్యేలపైన షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ప్రతినిధులుగా ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించింది ఇంట్లో కూర్చొని మాట్లాడడానికా అని ప్రశ్నించారు.

అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజలను వెన్నుపోటు పొడవడం కాదా అని నిలదీశారు. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 11 సీట్లే ఎందుకు ఇచ్చారని, అది మీ స్వయంకృతాపరాదమే కదా అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జలయజ్థం నవరత్నాలలో ఒకటిగా ఉన్నా దానిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఆరు నెలల్లో వైఎస్సార్ వదిలిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి చేయలేదన్నారు. 3500కోట్లతో ధన స్థిరీకరణ నిధి అన్నారని, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని, మెగా డీఎస్సీ అని మోసం చేశారన్నారు. మీ అవినీతి, అక్రమాలను గ్రహించే ప్రజలు మిమ్మల్నీ 11సీట్లకే పరిమితం చేశారన్నారు.

నాపైన, అమ్మపైన, కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో అసభ్యకర, అబద్దాల పోస్టులు పెట్టించింది వైఎస్ జగనే అని, ధైర్యం ఉంటే డైరెక్ట్ గా ఢీ కొట్టాలని అన్న వైఎస్ జగన్ కు షర్మిల సవాల్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సైతాన్ సైన్యంగా మారిందని, మహిళలు రాజకీయాల్లో ఉండాంటే భయపడాల్సిన పరిస్థితి కల్పించారన్నారు. ప్రస్తుతం అటువంటి వారిపై పోలీసులు తీసుకుంటున్న యాక్షన్ అభినందనీయమన్నారు. కానీ విషనాగులతో పాటు అనకొండలను కూడా అరెస్టు చేయాలన్నారు. 

Tags:    

Similar News