కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులతో ఫ్రీ వైద్యం ఏ రాష్ట్రంలో అందుతుందో తెలుసా?

జగన్ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్యం కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Update: 2023-12-20 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: జగన్ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్యం కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో కీలక మార్పులు తీసుకొచ్చింది. గతంతో పోలిస్తే చికిత్సల సంఖ్య పెంచడం, ప్యాకేజీలు పెంచడంతో పాటు ఆసుపత్రులను కూడా పెంచింది. ప్రస్తుతం ఏడాదికి 5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలను కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కోటి 48 లక్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చాయి. 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. వైసీపీ అధికారంలోకి రాక ముందు 1,059 ప్రొసీజర్లకు ఆరోగ్య శ్రీ సేవలు అందేవి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 3, 257 ప్రొసీజర్లకు ఫ్రీ వైద్యం అందిస్తుంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 19 నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.

కార్డుల పంపిణీ మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీ పరిధి పెంచనుంది. ప్రతి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాల చొప్పున ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు, ఆశా వర్కర్లతో పాటు ప్రజాప్రతినిధులు స్మార్ట్ కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేసి వాటిపై ప్రచారం చేస్తున్నారు. కాగా జనవరి నెలాఖరు నాటికి ఈ కార్డుల పంపిణీ పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతోంది.

స్మార్ట్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే రోగికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. రోగికి ఉన్న సమస్యలు, గతంలో చేయించుకున్న చికిత్సకు సంబంధించిన వివరాలు కూడా వస్తాయి. గతంలో రోగి వాడిన మందులు, ఇలా అన్ని అంశాలు ఈ కార్డులో పొందుపరిచి ఉంటాయి. దీంతో పేషెంట్ హాస్పిటల్‌కు వెళ్తే.. వారికి ఎలాంటి వైద్యం అందించాలో డాక్టర్లకు ఈజీగా తెలుసుకోవచ్చు.


Similar News