దొంగోడి నుంచి మంచి పరిపాలన ఆశిస్తున్నారా..? భలేవాడివి సామీ: నారా లోకేశ్

దొంగోడి నుంచి మంచి పరిపాలన ఎలా వస్తుంది సామీ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

Update: 2023-11-07 09:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : దొంగోడి నుంచి మంచి పరిపాలన ఎలా వస్తుంది సామీ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైఎస్ జగన్ 38 కేసుల్లో బెయిల్ పై తిరుగుతున్న దొంగోడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. దొంగోడు దొంగ పనులు కాక ఇంకేం చేస్తాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగోడి నుంచి మంచి పరిపాలన ఆశిస్తున్నారా... భలేవాడివి సామీ అంటూ ఓ విలేకరిని ఉద్దేశిస్తూ లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధికోసం సొంత బాబాయ్‌ని లేపేసిన వ్యక్తి జగన్ అని చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణలలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ కేసులో నిందితుడు అయిన అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు సీబీఐని రాష్ట్రానికి రాకుండా చేశారని లోకేశ్ ఆరోపించారు. ఇకపోతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌కు వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలపై 8పేజీల లేఖను అందజేశారు. అందులో చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలపై ఇప్పటివరకు నమోదు చేసిన కేసుల వివరాలు కూడా ఉన్నాయి. ఏపీలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని లోకేశ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో దాదాపు గంటకు పైగా టీడీపీ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను సమగ్రంగా నారా లోకేశ్ నేతృత్వంలోని టీడీపీ సభ్యుల బృందం వివరించింది. 

Tags:    

Similar News