ఏపీ పాలిటిక్స్‌లో సంచలన పరిణామం.. టీడీపీ MLC రఘురాజుపై అనర్హత వేటు

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల విడుదలకు మరికొన్ని గంటల ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-06-03 10:22 GMT

 దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల విడుదలకు మరికొన్ని గంటల ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల అధికార వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రఘురాజు శాసన మండలి సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్సీ రఘురాజుపై మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. కాగా, ఎన్నికలకు ముందు రఘురాజు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్సీ రఘురాజుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. వైసీపీ కంప్లైంట్ మేరకు విచారణ జరిపిన మండలి చైర్మన్.. తాజాగా ఎమ్మెల్సీ రఘురాజుపై వేటు వేశారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ నిర్ణయాన్ని రఘురాజు న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరీ చైర్మన్ నిర్ణయంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. రిజల్ట్స్ విడుదలకు ఒక్క రోజు ముందు ఎమ్మెల్సీపై వేటు పటడటం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Similar News