పిడుగురాల్లో 200 మందికి డయేరియా.. నలుగురు మృతి

పిడుగురాళ్లలో డయేరియా విజృంభించింది...

Update: 2024-07-12 16:18 GMT

దిశ, వెబ్ డెస్క్: పిడుగురాళ్లలో డయేరియా విజృంభించింది. నీటి కాలుష్యంతో 200 మందికి డయేరియా వచ్చింది. నలుగురు మృతి చెందారు. పిడుగురాళ్ల లెనిన్ నగర్, మారుతీనగర్‌లో ఈ ఒక్క రోజే 20 మంది డయేరియా బారిన పడ్డారు. ప్రధానంగా వాంతులు, విరేచనాలతో పిల్లలు బాధపడుతున్నారు. దీంతో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమం చేపట్టారు. కాచి చల్లారిన నీళ్లను తాగాలని ప్రజలకు సూచించారు. గత వారంగా మరింత మంది డయేరియా బారిన పడ్డారని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Similar News