AP News:అగనంపూడి టోల్ గేట్ శాశ్వతంగా ఎత్తివేయాలి..CPM స్టీల్ జోన్ కమిటీ డిమాండ్

అక్రమంగా నడుపుతున్న అగనంపూడి టోల్ గేట్ శాశ్వతంగా ఎత్తివేయాలని 78 వార్డు సీపీఎం కార్పొరేటర్ గంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-07-28 13:43 GMT

దిశ, ఉక్కు నగరం:అక్రమంగా నడుపుతున్న అగనంపూడి టోల్ గేట్ శాశ్వతంగా ఎత్తివేయాలని 78 వార్డు సీపీఎం కార్పొరేటర్ గంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగనంపూడి టోల్ గేట్ శాశ్వతంగా ఎత్తివేయాలని, టోల్ గేట్ కై పిలిచిన టెండర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం స్టీల్ జోన్ కమిటీ అధ్వర్యంలో అగనంపూడి టోల్ గేట్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. స్టీల్ జోన్ కమిటీ సభ్యులు యు మరిడయ్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా ఉద్దేశించి 78 వార్డు కార్పొరేటర్ బి.గంగారావుఅక్రమంగా నడుపుతున్న అగనంపూడి టోల్ గేట్ శాశ్వతంగా ఎత్తివేయాలని 78 వార్డు సీపీఎం కార్పొరేటర్ గంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక గాజువాక ఎమ్మెల్యే అగనంపూడి టోల్ గేట్‌ను తన అనుచరులతో పగులగొట్టి గాజువాక నియోజకవర్గం ప్రజలకు టోల్ గేట్ సమస్య తీరిపోయిందని ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీని నెరవేర్చానని ఆర్భాటంగా ప్రకటించారని అన్నారు.

ఇది జరిగిన కొద్ది రోజులకే భోగాపురం ఎయిర్ పోర్ట్ సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేషనల్ హైవే అధికారులకు అగనంపూడి టోల్ గేట్ కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి కి నిదర్శనం అని విమర్శించారు. వీరి వైఖరికి అనుగుణంగా హైవే అథారిటీస్ అగనంపూడి టోల్ గేట్ తిరిగి ప్రారంభించడానికి టెండర్లు పిలిచిందని ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ జోన్ కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ అనకాపల్లి నుంచి అనంతపురం వరకు ప్రారంభించి అక్కడ టోల్ గేట్ ఏర్పాటు చేసిన తర్వాత అగనంపూడి టోల్ గేట్ ఎత్తివేస్తామని చెప్పి నేటి వరకు ఈ టోల్ గేట్ నడిపి ప్రజల దగ్గర దోచుకుంటున్నారని ప్రభుత్వానికి అగనంపూడి టోల్ గేట్ ఎత్తివేయాలని చిత్తశుద్ధి నిజంగా ఉంటే వెంటనే టోల్ గేట్ ఎత్తివేస్తూ జివొ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


Similar News