Godavari Flood:నిలకడగా గోదావరి వరద ప్రవాహం
గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడిన గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి నిలకడగా మారింది.
దిశ,పోలవరం:గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడిన గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి నిలకడగా మారింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుండి 7,30,844 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే ఎగువన 31.340 మీటర్లు, స్పిల్ వే దిగువన 22.650 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎల్లండి పేట కొవ్వాడ రిజర్వాయర్లో నీటి మట్టం 89.40 మీటర్లు నమోదయిందని, ఆ నీటిమట్టాన్ని క్రమబద్దీకరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 120 క్యూసెక్కుల జలాలు మాత్రమే దిగువకు విడుదల చేస్తునట్లు సిబ్బంది ఇ.సత్యనారాయణ తెలిపారు.