AP News:ఉచిత ఇసుక విధానం పై ఫిర్యాదులు.. సీఎం చంద్రబాబు ఫైర్

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(Government) ఉచిత ఇసుక విధానం అమలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-16 12:39 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(Government) ఉచిత ఇసుక విధానం అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరి తీరాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) మంత్రులకు తేల్చి చెప్పారు. ఏపీ సచివాలయంలో నేడు(బుధవారం) కేబినెట్ సమావేశం(Cabinet Meeting) జరిగింది. ఈ కేబినెట్ భేటీ అనంతరం ఉచిత ఇసుక విధానం పై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నారని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

దీని పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఉచిత ఇసుక విధానం(Free sand procedure) ఫిర్యాదుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల్లో మార్పు రాకుంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏ స్థాయిలో తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక విరివిగా దొరకలన్నారు. అన్ని బంధనాలు తొలగించి రవాణా చార్జీలు(Transportation charges) కూడా వీలైనంత తక్కువ ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఇసుక తవ్వుకొని తీసుకెళ్తే రుసుములు చెల్లించకూడదని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక అక్రమాలు జరుగకుండా అధికారులు, ఇన్‌ఛార్జిలు బాధ్యతలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Tags:    

Similar News