సీఎం చంద్రబాబు పీఎస్ అంటూ ఫోన్లు..పోలీసులకు ఫిర్యాదు
ఇటీవల సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో ఎంతో మంది బలైతున్నారు. సామాన్య ప్రజానీకం నుంచి ప్రభుత్వ అధికారుల పై కూడా ఈ సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో ఎంతో మంది బలైతున్నారు. సామాన్య ప్రజానీకం నుంచి ప్రభుత్వ అధికారుల పై కూడా ఈ సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఈ క్రమంలో రోజుకో కొత్త తరహా మోసం తో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల నందిగామ జిల్లాకు చెందిన ఓ మహిళా ఈకేవైసీ పేరుతో మోసం చేశారు. ప్రజలకు సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టిన చాలా మంది వారి బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో కూడా ఈ కేటుగాళ్లు సైబర్ దాడికి పాల్పడినట్లు సమాచారం. గతంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శినంటూ పలువురు పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఏకంగా వాట్సాప్ డీపీగా సీఎం చంద్రబాబు ఫొటోను పెట్టారని తెలుస్తోంది. ఈ విధంగా చంద్రబాబు ఫొటో డీపీ పెట్టి పలు సార్లు కాల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.