ఏజెన్సీలో భద్రతా బలగాల కూంబింగ్.. మావోయిస్టుల ఫొటోలు విడుదల
ఏపీ అల్లూరి జిల్లా ఏజెన్సీలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపట్టాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అల్లూరి జిల్లా ఏజెన్సీలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. 13 మంది మావోయిస్టుల ఫొటోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి. మావోయిస్టుల సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని ఎస్పీ తుహిన్ సిన్హా ప్రకటించారు. ఏవోబీపై భద్రతా బలగాలు నిఘాను పెంచాయి. వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. పోలీసుల కూంబింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.