జగన్ సిద్ధం సభ తుస్సు..! రూ. 200 కోట్లు బొక్క అంటూ టీడీపీ ఘాటు విమర్శలు
ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో రాప్తాడు సిద్ధం సభ జరిగిందని, సభకు లక్షలాదిగా తరలి వచ్చారని వైసీపీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో ఇవాళ రాప్తాడు ‘సిద్ధం’ సభ జరిగిందని, సభకు లక్షలాదిగా తరలి వచ్చారని వైసీపీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఈ రాప్తాడు సిద్ధం సభపై తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ వేదికగా ఇవాళ తీవ్ర విమర్శలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ‘సాక్షిలో గ్రాఫిక్స్ , గ్రౌండ్ లో తుస్సు.. పది లక్షలు అన్నాడు, పది వేల మంది కూడా లేరు కదా.. పెద్దిరెడ్డికి రూ.200 కోట్లు బొక్క’ అంటూ టీడీపీ విమర్శించింది. ఈ నేపథ్యంలోనే వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఖాళీ కూర్చిలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు స్పందించాయి.
మీటింగుకు 4-5 గంటల ముందు వీడియో తీసి జనాలు రాలేదని చూపిస్తే నమ్మేస్తారు అనుకున్నారా అని టీడీపీకి శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. అయితే ఈ రాప్తాడు సభలో సీఎం జగన్ టీడీపీ, జనసేన పార్టీలకు కౌంటర్ ఇచ్చారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బయట ఉండాలని, గ్లాస్ సింకులో ఉండాలని ఆయన ఆ పార్టీలను తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కుర్చీలు మడిచి 23 సీట్లకు తగ్గించారని.. మరోసారి చొక్కా మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.