ఎన్నికల ఫలితాలకు ముందు సీఎం జగన్ కీలక ట్వీట్

ఏపీలో ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైన వేళ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు..

Update: 2024-06-03 16:05 GMT
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13న ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ కీలక మెసేజ్ చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారని తెలిపారు. మంగళవారం జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. తమ పార్టీకి ప్రజలు వేసిన ప్రతి ఓటునూ వైసీపీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని తాను ఆశిస్తున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News