AP Politics:కీలక అంశాల పై సీఎం చంద్రబాబు సమీక్ష..
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో నేడు (మంగళవారం) సీఎం చంద్రబాబు ఇసుక రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చంద్రబాబు చర్చించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని, ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ పై సీఎం సమీక్షించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా..అధికారులు వేగంగా పని చేయాలని తేల్చి చెప్పారు.