AP:వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ప్రతిపాదనలకు ఆమోదం
ఏపీ సీఎం చంద్రబాబు నేడు(శనివారం) వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నేడు(శనివారం) వైద్య ఆరోగ్య శాఖపై(Medical Health Department) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్య కుమార్‌తో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆమోదం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇక పై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉండనున్నారు. 190 కొత్త ‘108 వాహనాల’ కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 108 అంబులెన్స్(108 Ambulance) సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై రూ.4వేలు ఇవ్వనున్నారు. అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు రానున్నాయి. ప్రతి మండలంలో ‘జన ఔషధీ స్టోర్స్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రివెంటివ్ హెల్త్ కేర్‌కు(Preventive health care) ప్రాధాన్యం ఇచ్చేలా వైద్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. వైద్య శాఖలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు.