AP:‘ఎమ్మెల్యేలకు సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతుంది’.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాలు(Assembly Committee Hall)లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ముగిసింది.

Update: 2024-11-12 10:38 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాలు(Assembly Committee Hall)లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ముగిసింది. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రానురాను ఎమ్మెల్యే(MLA)లకు సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతుంది అన్నారు. ఇది మంచిది కాదని.. నిరంతరం నేర్చుకోవాలని, తెలుసుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నా అన్నారు.

కేంద్ర బడ్జెట్‌(Central budget)లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుందని తెలిపారు. పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అని సీఎం చంద్రబాబు అన్నారు. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు.. కానీ మనకు ఉంది అని సూచించారు. మనం ప్రజలకు జవాబుదారీగా పని చేద్దాం. ప్రజలకు ఏం అవసరమో.. ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక అని సీఎం చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News