Cm Chandrababu: 2న విశాఖ జిల్లాకు సీఎం చంద్రబాబు... ఎందుకంటే..!
అక్టోబర్ 2న విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు....
దిశ, వెబ్ డెస్క్: అక్టోబర్ 2న విశాఖ జిల్లా(Visakha District)లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పర్యటించనున్నారు. 100 రోజుల ప్రణాళిక, అభివృద్ధి ప్రాజెక్ట్‌లపై అధికారులతో సమీక్ష నిర్వహించానున్నారు. ఈమేరకు నివేదికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
కాగా విశాఖ జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిన నేపథ్యంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, చేపట్టాల్సిన ప్రాజెక్టులు, పనులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావించారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశారు. పూర్తి నివేదికలు సిద్ధం చేసి అక్టోబర్ 2న జరిగే కార్యక్రమంలో తనకు అందజేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అలాగే అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెట్ 2047(AP Vision Document 2047) విడుదల చేస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ – 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై సచివాలయంలో బుధవారం నీతి ఆయోగ్ ప్రతినిధులు(NITI Aayog Representatives), పలు రంగాల నిపుణులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీ విజన్ డాక్యుమెట్ 2047 విడుదలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.