CM Chandrababu: రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఇవాళ (ఆగస్టు31) తెల్లవారు జాము నుంచి ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

Update: 2024-08-31 03:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ (ఆగస్టు31) తెల్లవారు జాము నుంచి ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రజలు బయటికి రావాలంటే వణికిపోతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. విశాఖలో అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాతావరణ శాఖ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. ఇకపోతే తాజాగా వర్షాలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలెర్ట్ గా ఉండాలని కీలక హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో పాఠశాలకు సెలవు ప్రకటించాలని తెలిపారు. వర్షాలపై ప్రజలకు అలర్ట్ మెసేజ‌లు పంపాలన్నారు. వాగులు, వంకలు దగ్గర హెచ్చరిక బోర్డులు పెట్టాలని తెలిపారు. మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. కాకినాడ, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాఠశాలలు సెలవు ప్రకటించారు.


Similar News