చెన్నై ఐఐటీ కాంక్లేవ్‌లో తెలుగు విద్యార్థులు.. చూసి ఉప్పొంగిపోయిన చంద్రబాబు
చెన్నై ఐఐటీ కాంక్లేవ్‌లో తెలుగు విద్యార్థులను చూసి సీఎం చంద్రబాబు నాయుడు ఉప్పొంగిపోయి ప్రసంగించారు..
దిశ, వెబ్ డెస్క్: చెన్నైలో ఐఐటీ కాంక్లేవ్( Chennai IIT Conclave) కొనసాగుతోంది. ఈ కాంక్లేవ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu)పాల్గొన్నారు. కాంక్లేవ్‌లో తెలుగు విద్యార్థుల(Telugu students)ను చూసి ఆయన ఉప్పొంగిపోయారు. తెలుగులో మాట్లాడి విద్యార్థులను ఉత్సాహ పరిచారు. చెన్నైలో ఏ యూనివర్సిటీకి వెళ్లినా సగం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక గొప్ప అనుభవమని, తెలుగు వ్యక్తిగా, భారతీయుడిగా తాను చాలా గర్వపడుతున్నానని చెప్పారు. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు ఏఐ అని అంటున్నారని తెలిపారు. భారతీయులంటేనే సంపద సృష్టికర్తలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పట్లో హైదరాబాద్‌లో ఐటెక్ సిటీని నిర్మించానని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో క్వాంటమ్ వ్యాలీని డెవలప్‌మెంట్ చేయబోతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీకి పోటీకి క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలుగు విద్యార్థులపై తనకు విశ్వాసం, ఆశలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీ ప్రజల తలసరి ఆదాయం రూ.55 లక్షలు అవుతోందన్నారు. వేరే రాష్ట్రం, దేశాల్లో ఉండే ఏపీ విద్యార్థులు, ప్రజలు బాగా సంపాదించి ఆ డబ్బులతో ఏపీకి వచ్చి అభివృద్ధి చేసే పరిస్థితి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.