రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీ(Andhra Pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2025-04-13 04:06 GMT
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిగి మండలం, ధనాపురం వద్ద ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో రొద్దం మండలం, దొడగట్ట గ్రామానికి చెందిన అలివేలమ్మ, ఆదిలక్ష్మీ, సుంకమ్మ అనే ముగ్గురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన మరో 10 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. హిందూపురం రూరల్ మండలం కోటిపి చౌడేశ్వరి దేవి జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా హిందూపురం-సిరా హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Similar News