కాసేపట్లో పిఠాపురం సభకు పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు, లోకేశ్ సంచలన ట్వీట్స్

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు...

Update: 2025-03-14 11:06 GMT
కాసేపట్లో పిఠాపురం సభకు పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు, లోకేశ్ సంచలన ట్వీట్స్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: జనసేన(Janaseana) 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు సీఎం చంద్రబాబు(Cm Chandrababu), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. జన సేవా నిబద్ధత, విలువతో కూడిన రాజకీయాలకు ప్రతీక జనసేన అంటూ చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభివాదం చేస్తున్న ఫొటోను సైతం ఆయన షేర్ చేశారు.

Full View

మరోవైపు మంత్రి నారా లోకేశ్ సైతం పవన్ కల్యాణ్‌కు విషెస్ చెప్పారు. పవన్ కల్యాణ్‌ను అన్నా అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, అనుచరులకు తాను హృదయపూర్వకంగా శుభాకాంక్షులు చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు. ఏపీ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనసేన నిబద్ధత నిజంగా ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో పురోగతిని సాధించడానికి జనసేన పాత్ర అభినందనీయమని లోకేశ్ ట్వీట్ చేశారు. 

Full View

కాగా జనసేన అధినేత, పవన్ కల్యాణ్ కాసేపట్లో పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ నుంచి పిఠాపురంకు ఆయన బయల్దేరి వెళ్లారు. అయితే బయల్దేరే ముందు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జనసేన కార్యాలయం వద్ద అభిమానులు, కార్యకర్తలకు అభివాదం తెలిపారు. 

Tags:    

Similar News