జైలుకు పంపుతాం.. బోటు యజమానులకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
వరద బాధితుల నుంచి అధిక డబ్బులు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు బోటు యజమానులకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ (Vijayawada)లో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వరదలు (Floods) వచ్చి రెండు రోజులు అయినా ఇళ్లు, రోడ్లపై నీళ్లు అలా ఉన్నాయి. 4, నుంచి 5 అడుగుల మేర ఉన్న నీళ్లతో బాధితులు (Victims) చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వృద్ధులు, రోగులు పునరావాలసాలకు వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. దీంతో ప్రైవేటు బోటు యజమానులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. బాధితుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే నిత్యావసరాలపై భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఈ విషయం సీఎం చంద్రబాబు (Cm Chandrababu) దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు బోట్లకు డబ్బులు చెల్లిస్తున్నామని, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. అలాగే నిత్యావసరాల ధరల పెంపుదలపైనా సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నిత్యావసరాలు, కూరగాయల (Essentials, Vegetables) ధరలపై నిఘా పెట్టామని, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రంగంలోకి దింపామని, ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.