BREAKING: రమ్యకృష్ణ మృతి.. ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు
గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండల టీడీపీ మహిళా నేత మండవ రమ్యకృష్ణ నేడు తెల్లవారుజామున మృతిచెందారు.
దిశ, వెబ్‌డెస్క్: గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండల టీడీపీ మహిళా నేత మండవ రమ్యకృష్ణ నేడు తెల్లవారుజామున మృతిచెందారు. ఆమె షిర్డీ నుంచి గన్నవరం వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. కాగా రమ్యకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రమ్యకృష్ణ మరణం బాధాకరమని ఆయన సంతాపం తెలియజేశారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. గత ప్రభుత్వ దమణకాండను రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులతో ఆమె కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. కాగా ఆమె కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రమ్యకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.