టీడీపీ నేతలను నేనే సన్మానిస్తా... ఎంపీ మిథన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ నేతలను తానే సన్మానిస్తానని ఎంపీ మిథన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

Update: 2024-09-16 09:02 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేతల (Tdp Leaders)ను తానే సన్మానిస్తానని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Ycp Mp Mithun Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరు మున్సిపల్ కార్యాలయం (Punganur Muncipal Office)లో వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించిన ఆయన వక్ఫ్ బోర్డు బిల్లు(Waqf Board Bill)ను పార్లమెంట్‌ (Parliament)లో వ్యతికిస్తానని, మైనార్టీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గాన్ని పునర్విభజన చేస్తారన్న ప్రచారంపై స్పందించిన మిథున్ రెడ్డి అదంతా తప్పు అని కొట్టిపారేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరూ నమ్మొద్దని చెప్పారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. ఆ తర్వాత పుంగనూరును అభివృద్ధి చేసి టీడీపీ నేతలకు సన్మానం చేస్తానని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. 

కాగా పుంగనూరులో కొంతసమయం టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డిని టీడీపీ శ్రేణులు అడ్డుకుంటాయనే ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పుంగనూరు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. వైసీపీ నేతలు, కార్పొరేటర్లను తప్ప ఎవరినీ మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించలేదు.   పోలీసు భద్రతతో ప్రశాంతంగా సమావేశం ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


Similar News