తిరుమలలో జరుగుతున్న ఆ ప్రచారాలన్నీ ఫేక్..తేల్చి చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాల విషయంలో చేస్తున్న ప్రచారాలు అన్ని ఫేక్ అని, అవి ఎవరు నమ్మవద్దు అని టీటీడీ పేర్కొంది.
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి అన్నప్రసాదాల విషయంలో చేస్తున్న ప్రచారాలు అన్ని ఫేక్ అని, అవి ఎవరు నమ్మవద్దు అని టీటీడీ పేర్కొంది. అన్న ప్రసాదాల తయారీకి సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపేయాలని TTD భావిస్తున్నట్లు వచ్చిన వార్తలను దేవస్థానం తీవ్రంగా ఖండించింది అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వ్యాప్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ‘స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి టీటీడీ ఈవో శ్యామలరావు సుదీర్ఘంగా చర్చించిన మాట వాస్తవం కానీ అన్న ప్రసాదాల గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తల్ని నమ్మొద్దు’ అని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.