Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు...

Update: 2023-12-01 09:23 GMT

దిశ,వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. భక్తులు క్యూలైన్లో ఎక్కువ సేపు వేచి ఉండకుండా టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతి, తిరుమలలో 10 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 94 కౌంటర్ల ద్వారా డిసెంబర్ 22 నుంచి 4 లక్షల 23 వేల 500 టికెట్లను జారీ చేయనున్నారు. తిరుపతి ఇందిరా గ్రౌండ్‌తో పాటు రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీతోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లి జెడ్పీ స్కూలు, జీవనకోన జడ్పీ స్కూల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌంటర్లలో టికెట్లు తీసుకున్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు.

Tags:    

Similar News