Tirupati: సీఎం జగన్‌కు జనసేన కంగ్రాట్స్

వైసీపీ ప్రభుత్వం, నాయకులపై తిరుపతి జనసేన ఇన్‌చార్జి కిరణ్ రాయల్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు...

Update: 2023-04-13 11:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం, నాయకులపై తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం, నాయకులపై తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరుతో వైసీపీ ఇంటింటికి స్టికర్లు అతికిస్తుంటే ‘మా నమ్మకం నువ్వే పవన్’ పేరుతో స్టికర్‌లు అతికించి రాజకీయ వర్గాల్లో హీట్ పెంచారు. తాజాగా సీఎం వైఎస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు కంగ్రాట్స్ తెలిపారు. ప్రజల ముందు అమాయకుడిలా నటిస్తున్న జగన్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. ఏడీఆర్-ఎలక్షన్ వ్యాచ్ నివేదికలో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా వైఎస్ జగన్ నిలిచారన్న కథనాలపై కిరణ్ రాయల్ స్పందించారు. ‘ఆస్తులు జగన్‌కి అప్పులు ప్రజలకి’ అంటూ సెటైర్లు వేశారు.


వైఎస్ఆర్ సీఎంగా ఉన్న రోజుల్లో వెనకుండి రాష్ట్రాన్ని దోచుకుని అవినీతి సామ్రాట్‌గా ఎదిగి ఏ వన్ నిందితుడిగా జైలు జీవితం గడిపారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు సీఎంగా ప్రజల మాటున జైలు శిక్షను తప్పించుకుని జగన్ ఓ గజినీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని వేళల్లో కొందరిని మాత్రమే మోసం చేయగలరని , అన్ని వేళల్లో అందరినీ మోసం చేయలేరని జగన్‌కు సూచించారు. ప్రజలు మేలుకున్నారని ఈసారి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తారని కిరణ్ రాయల్ జోస్యం  చెప్పారు. 

Tags:    

Similar News