టీటీడీ ఫైల్స్ దగ్ధం పై విచారణ జరపాలి..ఆ పార్టీ నేతల డిమాండ్
మొన్న మదనపల్లి, నిన్న టీటీడీ పరిపాలన భవనం అగ్ని ప్రమాదాల విషయంలో ఎక్కడ నిజాలు బయటపడతాయన్న భయంతో ఫైల్స్ కాల్చి వేస్తున్న ఇంటి దొంగలకు వారిని నడిపించిన వైసీపీ నేతలకు శిక్ష తప్పదని బీజేపీ అధికార ప్రతినిధులు భాను ప్రకాష్ రెడ్డి , సామంచి శ్రీనివాస్ హెచ్చరించారు.
దిశ ప్రతినిధి,తిరుపతి:మొన్న మదనపల్లి, నిన్న టీటీడీ పరిపాలన భవనం అగ్ని ప్రమాదాల విషయంలో ఎక్కడ నిజాలు బయటపడతాయన్న భయంతో ఫైల్స్ కాల్చి వేస్తున్న ఇంటి దొంగలకు వారిని నడిపించిన వైసీపీ నేతలకు శిక్ష తప్పదని బీజేపీ అధికార ప్రతినిధులు భాను ప్రకాష్ రెడ్డి , సామంచి శ్రీనివాస్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదానికి సూత్రధారులు, పాత్రధారులు, లబ్ధిదారులు అందరూ కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనాని జోష్యం చెప్పారు. గతంలో వేల కోట్లు విలువ చేసే పనులకు టెండర్లు ఆహ్వానించి అందులో భారీగా కమిషన్ తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనులకు సంబంధించిన ఫైల్స్ నేడు అగ్నిప్రమాదంలో కాలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఈ ప్రమాదంపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.